తొలి శుభోదయం న్యూస్ దర్శి:-
తాళ్లూరు మండలం లక్కవరం గ్రామానికి చెందిన 30 వైసీపీ కుటుంబాలు వైసీపీకి రాజీనామా చేసి, దర్శి టీడీపీ ఇంచార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మీ గారు, టీడీపీ యువ నాయకులు డా. కడియాల లలిత్ సాగర్ గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.గ్రామ టీడీపీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో డా. గొట్టిపాటి లక్ష్మీ గారు వారికి పసుపు కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.టీడీపీ నాయకత్వంపై విశ్వాసంతో పాటు, కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులకు ఆకర్షితులై టీడీపీలో చేరుతున్నట్లు కొత్తగా చేరిన కుటుంబాల సభ్యులు తెలిపారు.ఈ సందర్భంగా డా. గొట్టిపాటి లక్ష్మీ గారు మాట్లాడుతూ… పార్టీ కోసం కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు, అండదండలు ఎల్లప్పుడూ ఉంటాయని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో తాళ్లూరు మండల టిడిపి అధ్యక్షులు మేడగం వెంకటేశ్వర రెడ్డి మండలానికి చెందిన పలువురు టిడిపి ముఖ్య నాయకులు హనుమారెడ్డి, ఆవుల ఆదినారాయణ, లక్ష్మీ రెడ్డి, మాజీ ఎంపీటీసీ సుబ్బారెడ్డి, సంపతి శ్రీను, కొత్తమారం పెరిరెడ్డి కార్యకర్తలు, గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు.
వైసీపీ ని వీడి టిడిపి లో చేరిన వారి వివరాలు :-
తూము కామిరెడ్డి, తూము పేరిరెడ్డి, లొకిరెడ్డి నరసింహా రెడ్డి, చిన్న నరసింహా రెడ్డి, కాటం బుక్కిరెడ్డి, సోము సుబ్బారెడ్డి, తూము వెంకటరమాణరెడ్డి, బిజ్జం పాపిరెడ్డి, బిజ్జం నాగిరెడ్డి, తూము వెంకట సుబ్బారెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, పాపిరెడ్డి, భూమా శ్రీను, కూకట్ల నరసింహా రావు, శ్రీను (పంతులు), రామకృష్ణ, బల్లిహరవ రమణయ్య, కొండ్రు ఆధిశేషు, విప్పర్ల రామారావు, వెంకట్రావు, ఆరతోటి నరసింహారావు, ఆదాము, దాసు, ప్రభాకర రావు, పరిశుద్ధం, వెలాశ, దివన బాబు, ఎలియా తదితరులు ఉన్నారు.