ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు.
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:-
జిల్లాలోని ప్రధాన రహదారులు, కూడళ్లు, రద్దీ ప్రాంతాల్లో పోలీసులు విస్తృతంగా వాహనాలను తనిఖీ చేసి వాహనదారుల డ్రైవింగ్ లైసెన్స్, వాహన ధ్రువపత్రాలు, హెల్మెట్ వినియోగం, సీట్ బెల్ట్, ట్రాఫిక్ నిబంధనల పాటింపు తదితర అంశాలను పరిశీలించారు.అనుమానాస్పద వాహనాలు, వ్యక్తులపై ప్రత్యేకంగా నిఘా ఉంచుతూ నేరాల నియంత్రణకు ముందస్తు చర్యలు చేపట్టారు. వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, కార్లలో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ ధరించాలని పోలీసులు సూచించారు.రోడ్డు భద్రతతో పాటు శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ కోసం వాహన తనిఖీలు, పెట్రోలింగ్ మరియు నిరంతర నిఘాను ప్రకాశం జిల్లా పోలీసులు కొనసాగిస్తున్నారు.