తొలి శుభోదయం న్యూస్ కందుకూరు :-
టి ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయం ప్రతిపత్తి) కందుకూరు నందు సోమవారం నవయుగ కవిత వైతాళికుడు శ్రీ గురజాడ అప్పారావు జయంతి ఘనంగా నిర్వహించడం జరిగింది. కళాశాల తెలుగు విభాగం ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈ కార్యక్రమంలో తెలుగు అధ్యాపకురాలు డాక్టర్ డాక్టర్ కె .పుష్పమ్మ, గురజాడ అప్పారావు గారు తెలుగు భాషకు చేసిన సేవను కొనియాడారు. స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యల్ని వివరిస్తూ ఆయన రచించిన కన్యాశుల్కం, కన్యక లాంటి రచనలను వివరించారు. తెలుగు అధ్యాపకులు శ్రీ డి. మోషే గురజాడ గారి సేవలను విద్యార్థినీ విద్యార్థులకు వివరించడంతోపాటు గురజాడ అప్పారావు ఖ్యాతిని వివరిస్తూ కవితను ఆలపించారు. అనంతరం విద్యార్థినీ విద్యార్థులు మరియు అధ్యాపకులు అందరూ దేశమును ప్రేమించుమన్నా అను గేయాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు డాక్టర్ పి. రాజగోపాల్, డాక్టర్ కె వి పద్మావతి, డాక్టర్ ప్రశాంతి డాక్టర్ తిరుపతి స్వామి, డాక్టర్ సి.హెచ్ సురేష్ కుమార్, శ్రీమతి నాగమల్లేశ్వరి, డాక్టర్ పి. సరళ తదితరులు పాల్గొన్నారు.