ఫిర్యాదిదారుల సమస్యలను పరిష్కరించేందుకు సోమవారం ప్రకాశం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో “మీకోసం (PGRS)” ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమాన్ని అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) యుగంధర్ బాబు గారు మరియు పోలీస్ అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదిదారులతో పోలీస్ అధికారులు ముఖాముఖిగా మాట్లాడి, వారి సమస్యలను విని వివరాలు అడిగి తెలుసుకున్నారు. కుటుంబ కలహాలు, అత్తారింటి వేధింపులు, ఉద్యోగ సంబంధిత / ఆన్‌లైన్ మోసాలు, భూ వివాదాలు తదితర అంశాలకు సంబంధించిన ఫిర్యాదులను ఫిర్యాదిదారులు స్వేచ్ఛగా విన్నవించారు. ఫిర్యాదిదారుల యొక్క సమస్యలను సవివరంగా విని, సానుకూలంగా స్పందించిన అధికారులు చట్టప్రకారం చర్యలు తీసుకోని త్వరితగతిన న్యాయం అందిస్తామని భరోసా కల్పించారు.అందిన ఫిర్యాదులపై సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులతో అధికారులు మాట్లాడి, ప్రతి ఫిర్యాదుపై తక్షణమే విచారణ చేపట్టి, చట్టప్రకారం తగిన చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయానికి వ్యక్తిగతంగా హాజరుకాలేని ప్రజలు తమ ఫిర్యాదులను సమీపంలోని పోలీసు స్టేషన్‌లు, సర్కిల్ కార్యాలయాలు లేదా సబ్-డివిజన్ కార్యాలయాల ద్వారా కూడా అందజేయవచ్చు.ఈ కార్యక్రమంలో ఒంగోలు డిఎస్పీ ఆర్.శ్రీనివాసరావు,ఒంగోలు ట్రాఫిక్ సీఐ హాజరత్తయ్య, కొండేపి సీఐ రమణయ్య,అద్దంకి సీఐ మల్లికార్జున రావు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *