తొలి శుభోదయం న్యూస్ దర్శి:-
రాష్ట్రవ్యాప్తంగా పట్టణాల రూపురేఖలు మార్చేలా మౌలిక వసతుల అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కుప్పం నుంచి వర్చువల్‌గా శ్రీకారం చుట్టారు.ఈ కార్యక్రమంలో భాగంగా దర్శి మున్సిపాలిటీ పరిధిలో రూ.12 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించారు.దర్శి పట్టణం పొదిలి రోడ్‌లోని పి.జి.ఎన్. కాంప్లెక్స్‌లో మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన HAM ప్రాజెక్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి దర్శి టీడీపీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు వర్చువల్‌గా హాజరయ్యారు.హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM) ద్వారా పట్టణ స్థానిక సంస్థలపై ఆర్థిక భారం పడకుండా రాష్ట్రవ్యాప్తంగా భారీ స్థాయిలో అభివృద్ధి పనులు చేపడుతున్నారు.
రోడ్ల నిర్మాణానికి రూ.4,656 కోట్లు
సెంట్రల్ మీడియన్లకు రూ.88 కోట్లు
స్ట్రీట్ లైటింగ్‌కు రూ.247 కోట్లు
పార్కుల అభివృద్ధికి రూ.509 కోట్లు
ఈ ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2,165 కి.మీ. రోడ్లు, 502 పార్కులు, 210 కి.మీ. సెంట్రల్ మీడియన్లు, 391 కి.మీ. స్ట్రీట్ లైటింగ్, 300 కి.మీ. సీవరేజ్ పనులు చేపట్టనున్నారు.దర్శి పట్టణాన్ని ఆధునిక మౌలిక వసతులతో మరింత అభివృద్ధి చేయడమే లక్ష్యంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారి అడుగులు కొనసాగుతున్నాయి.