తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
కందుకూరులోని గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో నిర్వహించిన ఇండోసోల్ జాబ్ మేళాలో కందుకూరు సబ్ కలెక్టర్ దామెర హిమవంశీ గారితో కలిసి పాల్గొని యువతీ యువకులతో మాట్లాడటం జరిగింది.కందుకూరు ప్రాంతం రాబోయే రోజుల్లో పారిశ్రామిక హబ్‌గా అభివృద్ధి చెందే దిశగా అడుగులు వేస్తోంది. ఇండోసోల్, బీపీసీఎల్ వంటి భారీ పరిశ్రమలు రావడం ద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు, మన ప్రాంత ఆర్థికాభివృద్ధికి కూడా ఊతం లభిస్తుంది.భూములు కోల్పోయిన స్థానిక కుటుంబాలకు న్యాయం చేయడంతో పాటు, మన ప్రాంత యువతకే ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో ప్రాధాన్యం కల్పించాలన్నది మా ప్రధాన లక్ష్యం.గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మంత్రి శ్రీ నారా లోకేష్ గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమలకు అనుకూల వాతావరణం ఏర్పడుతోంది.కందుకూరు యువత భవిష్యత్తు కోసం పరిశ్రమలతో కలిసి మరిన్ని అవకాశాలను తీసుకురావడానికి కృషి చేస్తాను.