టి.ఆర్.ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయం ప్రతిపత్తి), కందుకూరు నందు వృక్షశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో విద్యార్థినీ విద్యార్థులకు విత్తన బంతుల తయారీ మరియు వ్యాప్తిపై అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది.అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని, రాష్ట్రంలో 50% పైగా అడవులను పునరుద్ధరించాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హరిత సమాహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా 2.5 నుండి 3 కోట్ల సేంద్రియ విత్తన బంతులను తయారు చేసి వ్యాప్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించింది.ఈ స్ఫూర్తితో కళాశాల వృక్షశాస్త్ర విభాగ ఇన్చార్జ్ శ్రీ డి. రాజశేఖర్ మరియు అధ్యాపకులు డాక్టర్ ఎన్. తిరుపతి స్వామి ఆధ్వర్యంలో, విద్యార్థినీ విద్యార్థుల సహకారంతో నేరేడు గింజలతో విత్తన బంతులను తయారు చేసి కళాశాల ఆవరణలోని ఖాళీ ప్రదేశాలలో చల్లడం జరిగింది.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. రవికుమార్, అధ్యాపకులు డాక్టర్ పి. రాజగోపాల్, డాక్టర్ ఎన్.వి. శ్రీహరి, శ్రీ కె. శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.కళాశాలలో ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం ఎంతో సంతోషదాయకమని, ఇటువంటి కార్యక్రమాలు పర్యావరణ పరిరక్షణకు ఎంతగానో తోడ్పడతాయని ప్రిన్సిపాల్ పేర్కొంటూ, వృక్షశాస్త్ర విభాగాన్ని మరియు విద్యార్థులను అభినందించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *