ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ప్రజలకు పోలీసు శాఖను మరింత చేరువ చేయడంతో పాటు, గ్రామీణ ప్రాంతాల్లో శాంతిభద్రతలను పటిష్టంగా పరిరక్షించేందుకు ప్రకాశం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో “పల్లె నిద్ర” కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది గ్రామంలో రాత్రి బస చేసి ప్రజలతో నేరుగా మమేకమై, వారి సమస్యలు, ఇబ్బందులు మరియు భద్రతకు సంబంధించిన అంశాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలోని శాంతిభద్రతల పరిస్థితి, అసాంఘిక కార్యకలాపాలు, మహిళలు మరియు బాలికల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, రోడ్డు భద్రత తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.ప్రజలు తమ సమస్యలను నిర్భయంగా పోలీసుల దృష్టికి తీసుకురావాలని, గ్రామాల్లో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నా పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు సూచించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *