పసుపులేటి రవితేజ నాల్గవ వర్ధంతి సందర్భంగా, ఆయన అన్న పసుపులేటి సతీష్ సహకారంతో కిలాడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాలిరెడ్డి నగర్ మరియు బాలాజీ నగర్ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా కిలాడీ ఫౌండేషన్ చైర్మన్ కిలాడీ మాట్లాడుతూ, పసుపులేటి రవితేజ జ్ఞాపకార్థం విద్యార్థులకు అన్నదానం చేయడం సంతోషంగా ఉందన్నారు. సేవా కార్యక్రమాల ద్వారా ఆయన జ్ఞాపకాలను చిరస్థాయిగా నిలుపుకోవడం అభినందనీయమన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల విద్యాభివృద్ధికి కిలాడీ ఫౌండేషన్ తరపున తమ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా న్యాయవాది పంతగాని వెంకటేశ్వర్లు పాల్గొని విద్యార్థులకు అన్నదానం చేశారు. విద్యార్థుల సంక్షేమం కోసం ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కిలాడీ ఫౌండేషన్ సభ్యులు జాలి భాయ్, ఉదయ్, సంతోష్, శేషు, శివ పాల్గొన్నారు. అలాగే బాలాజీ నగర్ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొల్లూరు వెంకయ్య, ఉపాధ్యాయులు చిడితోటి నరేంద్ర కుమార్, హిమబిందు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *