చిత్తూరు జిల్లా కుప్పం నుంచి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వర్చువల్‌గా ఈ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టగా, కందుకూరులో అంబేద్కర్ విగ్రహం వద్ద పనుల శిలాఫలకాన్ని ఆవిష్కరించాను.
ఈ నిధులతో సీసీ రోడ్లు, కాంక్రీట్ డ్రైనేజీ కాలువలు, సెంట్రల్ డివైడర్లు, లైటింగ్, పార్కుల అభివృద్ధి వంటి అనేక మౌలిక వసతుల పనులు చేపట్టనున్నాం. ముఖ్యంగా పాత ఇటుక కాలువల స్థానంలో కాంక్రీట్ కాలువల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తాం. మరో రెండు పార్కులను కూడా సుందరంగా తీర్చిదిద్దుతాం.కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కందుకూరు మున్సిపాలిటీ అభివృద్ధికి ఇప్పటికే రూ.50 కోట్లు, శివారు ప్రాంతాల తాగునీటి అవసరాలకు రూ.40 కోట్లు కేటాయించగా, ఇతర నిధులతో కలిపి మొత్తం రూ.150 కోట్లతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ఇప్పుడు మరో రూ.30 కోట్లతో అభివృద్ధి మరింత వేగవంతం కానుంది.మాది మాటలు చెప్పే ప్రభుత్వం కాదు.. చేతల్లో చేసి చూపించే ప్రభుత్వం.అభివృద్ధి పనులకు అడ్డంకులు సృష్టించడం సరికాదు. రాజకీయాలకు అతీతంగా కందుకూరు అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలి.కందుకూరును పరిశుభ్రమైన, సుందరమైన, అభివృద్ధి చెందిన పట్టణంగా తీర్చిదిద్దడమే మా లక్ష్యం. ప్రజల ఆశీస్సులతో ఈ అభివృద్ధి ప్రయాణాన్ని మరింత వేగంగా కొనసాగిద్దాం.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *