దర్శి టీడీపీ కార్యాలయంలో గృహ నిర్మాణ శాఖ అధికారులతో దర్శి టీడీపీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా నియోజకవర్గంలో ఇప్పటివరకు మంజూరైన గృహాలు, వివిధ దశల్లో పెండింగ్‌లో ఉన్న నిర్మాణాలు, వాటి ఆలస్యానికి గల కారణాలు, కొత్తగా ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.అలాగే గ్రామాలు, మున్సిపాలిటీ పరిధిలో ఇంకా ఇళ్లు అవసరమైన అర్హులైన కుటుంబాలను సమగ్ర సర్వే ద్వారా గుర్తించి, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఎటువంటి జాప్యం లేకుండా ఇల్లు మంజూరు చేయడంతో పాటు, పెండింగ్‌లో ఉన్న ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.ఈ సమావేశంలో హౌసింగ్ డీఈ, ఏఈలు, వర్క్ ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *