దొనకొండ మండలం చందవరం గ్రామంలోని బౌద్ధ స్తూపం అభివృద్ధి కోసం జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజబాబు గారు మరియు అధికారులతో కలిసి దర్శి టీడీపీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు మంగళవారం సాయంత్రం ప్రాంతాన్ని సందర్శించారు.ఈ సందర్భంగా చందవరం గ్రామంలోని రహదారి పరిస్థితిని గమనించిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు, ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కలెక్టర్ గారిని విజ్ఞప్తి చేశారు.వెంటనే స్పందించిన కలెక్టర్ గారు, రోడ్డు నిర్మాణానికి అవసరమైన అంచనాలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. త్వరలోనే రోడ్డు నిర్మాణ పనులను పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.చందవరం అభివృద్ధికి మరో ముందడుగు!
ప్రజల అవసరమే లక్ష్యం… అభివృద్ధే సంకల్పం!

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *