తొలి శుభోదయం న్యూస్ దర్శి:-
దర్శి పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) ద్వారా వైద్య ఖర్చుల కోసం మంజూరైన రూ.48,94,427 విలువైన చెక్కులను 100 మంది లబ్ధిదారులకు దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారి చేతుల మీదుగా పంపిణీ చేశారు.ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు మాట్లాడుతూ… పేద, మధ్యతరగతి కుటుంబాలు వైద్య ఖర్చుల కోసం అప్పుల పాలుకాకూడదనే ఉద్దేశంతో, అవసరమైన సమయంలో CMRF ద్వారా ఆర్థిక సహాయం అందిస్తూ కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందని తెలిపారు.ప్రజల కష్టాల్లో తోడుగా నిలిచి, సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తున్న ప్రభుత్వానికి ప్రజల సహకారం ఉండాలని ఆమె కోరారు.ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు, దర్శి టౌన్ టీడీపీ అధ్యక్షులు చిన్న, నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు, కూటమి శ్రేణులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.