తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:-
జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం రెండో విడత కార్యక్ర మాన్ని సెప్టెంబర్ 25న జిల్లా వ్యాప్తంగా విజయ వంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వ యంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఎం.విజయ సునీత ఆదేశించారు. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం నిర్వహణపై జిల్లా అధికారులతో కలెక్టర్ అధ్యక్షతన బుధవారం స్థానిక కలెక్టరేట్లో సన్నద్ధత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమం అమలు,లక్ష్యాలు, శాఖల వారీగా చేపట్టా ల్సిన చర్యలపై సమీక్షించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..జిల్లాలో 1 సం” నుంచి 19 సంవత్సరాల వయస్సుగల సుమారు 2,35,409 మంది పిల్లలు, కిశోర బాల బాలికలకు అల్బెండజోల్ మాత్రలు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సెప్టెంబర్ 25న విద్యా సంస్థలు, అంగ న్వాడీ కేంద్రాల్లో మాత్రల పంపిణీ చేపట్టాలని, ఆ రోజు మాత్రలు తీసుకోలేక పోయిన వారికి అక్టోబర్ 5న మాప్-అప్ కార్యక్రమం ద్వారా అందించాలని సూచించారు.అన్ని అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, ఐటీఐలు, పాలిటెక్నిక్ కళాశాలలు, నర్సింగ్ కళాశాలలు, డిగ్రీ, ఇంజనీరింగ్, వైద్య కళాశాలల్లోని అర్హులైన విద్యార్థులకు మాత్రలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాలకు వెళ్లని పిల్లలు, దివ్యాంగులు, భవిత కేంద్రాల్లోని పిల్లలకు కూడా సమీప అంగన్వాడీ కేంద్రాల ద్వారా మాత్రలు అందించాలని తెలిపారు.1–2 సంవత్సరాల పిల్లలకు సగం మాత్ర, 2–19 సంవత్సరాల పిల్లలకు ఒక మాత్ర ఇవ్వాలని, 1–5 సంవత్సరాల చిన్నా రులకు మాత్రను నీటిలో కలిపి ఇవ్వాలని సూ చించారు. మాత్రలను ఆరోగ్య సిబ్బంది, ఉపాధ్యాయులు, అంగన్వాడీ సిబ్బంది పర్యవేక్షణలోనే వేయిం చాలని స్పష్టం చేశారు. నులిపురుగుల నివారణ ద్వారా పిల్లల్లో రక్తహీనత, పోషకాహార లోపం వంటి సమస్యలను తగ్గించి ఆరోగ్యకరమైన ఎదు గుదలకు దోహదపడు తుందని కలెక్టర్ పేర్కొన్నారు.కార్యక్రమంపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించేందుకు ఆరోగ్య కేంద్రాలు, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, కళాశాలల్లో గోడపత్రికలు, ఇతర ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని ఆదే శించారు. అల్బెండజోల్ మాత్రల వినియోగంపై తల్లి దండ్రులు, విద్యా ర్థులకు అవగాహన కల్పించాలని, అరుదుగా ఎదురయ్యే ప్రతికూల ప్రభావాలపై తక్షణ వైద్య సేవలు అందించేందుకు రాపిడ్ రెస్పాన్స్ టీమ్లు, 108 అత్యవసర వైద్య సేవల వాహనాలను సిద్ధంగా ఉంచాలని సూచించారు. కార్య క్రమానికి సంబంధించిన డేటా ఎంట్రీని ఎటువంటి పొరపాట్లకు తావులే కుండా సక్రమంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.జాతీయ బాల ఆరోగ్య కార్యక్రమం ద్వారా పుట్టినప్పటి నుంచి 18 సంవత్సరాల వయస్సు వరకు పిల్లల్లో పుట్టుకతో వచ్చే లోపాలు, పోషకా హార లోపాలు, వ్యాధు లు, అభివృద్ధిలో ఆల స్యం, వైకల్యాలు, దృష్టి, వినికిడి, దంత సమ స్యలు, రక్తహీనత, చర్మవ్యాధులు తదితర ఆరోగ్య సమస్యలను సమగ్రంగా స్క్రీనింగ్ చేసి గుర్తించాలని కలెక్టర్ సూచించారు. గుర్తించిన పిల్లలకు అవసరమైన చికిత్స, తదుపరి వైద్య సేవలు అందేలా రిఫరల్, ఫాలోఅప్ చర్యలు చేప ట్టాలన్నారు.పోషకాహార పునరావాస కేంద్రాలు ద్వారా తీవ్ర పోషకాహార లోపం తో బాధపడుతున్న పిల్లలకు అవసరమైన వైద్య చికిత్స, పోషకాహార పునరావాసం అందించడంతో పాటు తల్లిదండ్రు లకు పిల్లల పోషణ, ఆరోగ్య సంరక్షణపై అవగాహన,శిక్షణ కల్పించాలని ఆదేశించారు. కార్యక్రమం విజయ వంతానికి శాఖలు పర స్పర సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు.సమావేశంలో ఎన్సీడీ– ఆర్బీఎస్కే డీసీ డా. డీ.చంద్ర శేఖర్ , వైద్య ఆరోగ్య శాఖ డీఎల్ఏటీఓ & డీఎంఓ డా. కె రాహుల్, చంద్రన్న సంచార చికిత్స ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ డి సందీప్ తదితరులు పాల్గొన్నారు.