తాళ్లూరు మండల కేంద్రంలో DRDA–వెలుగు ఆధ్వర్యంలో డ్వాక్రా సంఘాల మహిళల ఆర్థిక స్వావలంబనకు ఏర్పాటు చేసిన సహకార వ్యవసాయ ఉత్పత్తుల సంస్థ (వ్యవసాయ పనిముట్ల అద్దె కేంద్రం) ను దర్శి టీడీపీ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు, అధికారులు, టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ గారు, స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ మాట్లాడుతూ, మహిళలను స్వయం శక్తితో నిలబెట్టాలనే ఆలోచనతో ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించిన డ్వాక్రా సంఘాలు నేడు ఎంతో బలోపేతమయ్యాయని అన్నారు.మహిళలకు ఆర్థికంగా అండగా నిలిచే పలు కార్యక్రమాలతో పాటు, వ్యవసాయ రంగానికి కూడా కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు. సన్న, చిన్నకారు రైతులకు అవసరమైన వ్యవసాయ పనిముట్లను అద్దెకు అందించడం ద్వారా రైతులకు ఖర్చు తగ్గించడంతో పాటు, డ్వాక్రా మహిళలకు ఆదాయ అవకాశాలు కల్పించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు.వెలుగు ద్వారా మహిళలకు అందుబాటులో ఉన్న వివిధ ఉపాధి అవకాశాలు, ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించేలా అధికారులు గ్రూప్ మీటింగ్స్ నిర్వహించాలని సూచించారు.రైతుకు చేయూత… మహిళకు ఆర్థిక బలం… గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊతం అందించే ఈ అవకాశాన్ని రైతులు, డ్వాక్రా సంఘాల మహిళలు సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ దారం నాగవేణి–సుబ్బారావు, ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, జడ్పీటీసీ మారం వెంకారెడ్డి, ఎంపీడీవో అజిత, DRDA–వెలుగు అధికారులు, టీడీపీ నాయకులు, కూటమి శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *