ఆక్సిడెంట్ లో మృతి చెందిన బాధిత పోలీస్ కుటుంబానికి గ్రూప్ పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ (GPAI) చెక్కును బుధవారం జిల్లా పోలీస్ క్యాంపు కార్యాలయంలో జిల్లా ఎస్పీ గారు అందచేసినారు. ఏఆర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తూ, తేదీ 12.07.2026న ఉదయం ఒంగోలు టౌన్‌లోని పద్మ టవర్స్ ఎదురుగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్ మరియదాసు (AR PC-3891, 35 సం.) గారి సతీమణి కె.భారతి గారికి రూ. 21,15,000/- చెక్కును అందచేసినారు. జిల్లా ఎస్పీ గారు కానిస్టేబుల్ కుటుంబ సభ్యుల యోగక్షేమాలను, పిల్లల చదువుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అంకితభావంతో విధులు నిర్వహిస్తూ, దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం ఎంతో బాధాకరమన్నారు. ఈ సందర్భంగా అందజేసిన చెక్కు ద్వారా లభించే ఆర్థిక సహాయం కుటుంబానికి కొంతమేర ఆర్థిక భరోసా కల్పిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పోలీసు శాఖ పరంగా మృతిచెందిన సిబ్బందికి అందాల్సిన ఇతర ప్రయోజనాలను కూడా త్వరితగతిన అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మృతిచెందిన సిబ్బంది కుటుంబ సభ్యులకు పోలీసు శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, ఏదైనా సమస్య ఉన్న నేరుగా తనను కలవవచ్చునని వారి కుటుంబ సభ్యులకు జిల్ల ఎస్పీ గారు భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో డీపీఓ సిబ్బంది పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *