తొలి శుభోదయం న్యూస్ దర్శి:-
దర్శి పట్టణం అద్దంకి రోడ్డులోని రామాలయం దేవస్థాన ప్రాంగణంలో శ్రీకృష్ణదేవరాయ కాపు సంఘం ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన వినాయకుని విగ్రహం వద్ద దర్శి టీడీపీ ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ–డాక్టర్ కడియాల లలిత్ సాగర్ గార్ల దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు.అనంతరం వారి చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, దర్శి సొసైటీ అధ్యక్షులు కలువకొలను చంద్రశేఖర్ (పంతులు), మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, ఏఎంసీ చైర్మన్ దారం నాగవేణి–సుబ్బారావు, శ్రీకృష్ణదేవరాయ కాపు సంఘం సభ్యులు, టీడీపీ నాయకులు, కూటమి శ్రేణులు, స్థానిక భక్తులు పాల్గొన్నారు.