జిల్లాకు నూతనంగా నియమితులైన ఎస్పీ పంకజ్ కుమార్ మీనా గురువారం తన బాధ్యతలను స్వీకరించిన అనంతరం జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీతను కలెక్టరేట్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌కు పుష్పగుచ్ఛం అందజేశారు.అనంతరం జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత, ఎస్పీ పంకజ్ కుమార్ మీనా జిల్లాలో శాంతిభద్రతల పరిస్థితిపై చర్చించారు. ప్రజలకు ప్రశాంతమైన, సురక్షితమైన వాతావరణం కల్పించేందుకు పోలీసు శాఖ తీసుకుంటున్న చర్యలు, జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ప్రజల భద్రతకు సంబంధించిన పలు అంశాలపై వారు సమీక్షించారు.జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ముందస్తు చర్యలు చేపట్టడంతో పాటు, ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించేలా పోలీసు యంత్రాంగం పనిచేసేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ ని కోరారు. శాంతిభద్రతల పరిరక్షణలో రెవెన్యూ, పోలీసు తదితర శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చని వారు పేర్కొన్నారు.ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడం, ప్రజల్లో భద్రతా భావన పెంపొందించేలా చర్యలు చేపట్టడం వంటి అంశాలపై ఇరువురు అధికారులు చర్చించారు. జిల్లాలో ప్రశాంత వాతావరణాన్ని కొనసాగించేందుకు అవసరమైన చర్యలను సమన్వయంతో చేపట్టాలని నిర్ణయించారు.ఈ సందర్భంగా నూతన ఎస్పీ పంకజ్ కుమార్ మీనాకు జిల్లా కలెక్టర్ విజయ సునీత శుభాకాంక్షలు తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *