తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:-
ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు గూడ్లూరు సర్కిల్ కార్యాలయంలో క్రైమ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి గూడ్లూరు సర్కిల్ పరిధిలోని స్టేషన్ హౌస్ ఆఫీసర్లు (SHOs) మరియు సంబంధిత పోలీస్ సిబ్బంది హాజరయ్యారు.ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ల వారీగా నమోదైన కేసుల పురోగతి, పెండింగ్‌లో ఉన్న కేసులు, దర్యాప్తు తీరుతెన్నులు మరియు నేర నియంత్రణ చర్యలను సమీక్షించారు. పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి, వీలైనంత త్వరగా పరిష్కార దశకు తీసుకురావాలని అధికారులకు సూచించారు.అదేవిధంగా సర్కిల్ పరిధిలో చట్టవ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాలపై నిరంతరం నిఘా ఉంచాలని, అవసరమైన చోట సమర్థవంతమైన ఎన్ఫోర్స్‌మెంట్ చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించడంతో పాటు శాంతిభద్రతల పరిరక్షణకు సమన్వయంతో పనిచేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.