అడిషనల్ కమిషనర్, పంచాయతీరాజ్ వారి గూగుల్ మీట్ ఆదేశాల మేరకు మరియు శ్రీయుత జిల్లా పంచాయతీ అధికారి, ప్రకాశం జిల్లా వారి సూచనల మేరకు, వర్మీ కంపోస్ట్ ప్రొడక్షన్‌లో ర్యాంకింగ్ తక్కువగా వచ్చిన మండలాలైన కొండేపి, జరుగుమల్లి మరియు టంగుటూరు మండలాల MPDOలు, డిప్యూటీ MPDOలు, PDOలు మరియు గ్రీన్ అంబాసిడర్స్ కు ఒకరోజు ఎక్స్‌పోజర్ శిక్షణ సింగరాయకొండ మండలం, మూలగుంటపాడు LTC సెంటర్ నందు నిర్వహించబడింది.శిక్షణలో భాగంగా వర్మీ కంపోస్ట్ ప్రొడక్షన్‌ను సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన పలు అమూల్యమైన సూచనలు మరియు విధానాలను క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించడం జరిగింది. అలాగే SWPC షెడ్‌లో జరుగుతున్న వర్మీ కంపోస్ట్ ప్రాసెసింగ్ విధానాన్ని ప్రత్యక్షంగా పరిశీలించి, వర్మీ కంపోస్ట్ ప్రొడక్షన్‌కు సంబంధించిన పూర్తి ప్రక్రియపై అవగాహన పొందడం జరిగింది.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *