తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:-
ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ప్రజల భద్రతను మరింత పటిష్టం చేయడంలో భాగంగా ప్రకాశం జిల్లా పోలీసులు బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రయాణికుల రాకపోకలు అధికంగా ఉండే ప్రాంతాలు, ప్లాట్ఫారాలు, వెయిటింగ్ ఏరియాలు, బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తులను ప్రశ్నించి, వారి వివరాలను పరిశీలించడంతో పాటు అనుమానాస్పద బ్యాగులు, వస్తువులు మరియు వాహనాలను తనిఖీ చేశారు.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఈ తనిఖీలు చేపట్టారు. ప్రయాణికులు తమ సామగ్రి విషయంలో అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే వెంటనే సమీపంలోని పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.ప్రజలకు సురక్షితమైన ప్రయాణ వాతావరణం కల్పించేందుకు ప్రధాన రవాణా కేంద్రాల్లో నిరంతర నిఘా, పెట్రోలింగ్ మరియు తనిఖీలను ప్రకాశం జిల్లా పోలీసులు కొనసాగిస్తున్నారు.