సింగరాయకొండ మండల కేంద్రంలో జాతీయ మహాసభల పోస్టర్ ఆవిష్కరణ 21 రాష్ట్రాల నుంచి ప్రతినిధులు హాజరవు తారు కార్పొరేట్ శక్తుల కబంధ హస్తాలనుంచి పంట పొలాలను కాపాడుకోవాలని రైతాంగానికి కూలీలకు పిలుపు సెప్టెంబరు 28, 29,30వ తేదీలలో తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా కేంద్రంలో జరుగు అఖిల భారత రైతు కూలి సంఘం(aikms) 4వ జాతియ మహాసభలను చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం (aikms )జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ నాంచార్లు రైతులు, కూలీలకు పిలుపునిచ్చారు, శుక్రవారం సింగరాయకొండ మండల కేంద్రంలో అఖిల భారత రైతు కూలి సంఘం(aikms) జాతీయ మహాసభల పోస్ట్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా నాంచార్లు కే,నాంచార్లు మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ,షా పాసి స్ట్ పాలకులు, రాష్ట్రంలోని చంద్రబాబు కూటమి ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగించేందుకు రైతాంగ, కూలీల వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని రైతులను కూలీలుగా మారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు, రైతాంగాన్ని కాపాడడానికి వ్యవసాయాన్ని రక్షించడానికి అడవులు,ప్రకృతిని పరిరక్షించడానికి రైతులు కూలీలు పోరాడాలనే లక్ష్యంతో పోరాట కర్తవ్యాలను ఈ జాతీయ మహాసభల్లో నిర్దేశించుకుంటామని, ఈ జాతీయ మహాసభలకు దేశంలో, 21 రాష్ట్రాల నుంచి ప్రతినిధులు హాజరవుతున్నారని సెప్టెంబర్ 28వ తేదీ ఖమ్మం పట్టణంలో భారీ రైతు కూలీల ప్రదర్శన అనంతరంబహిరంగ సభ జరుగుతుంది. ఈ బహిరంగ సభకు అఖిల భారత రైతు కూలీ సంఘం జాతీయ అధ్యక్షులు కామ్రేడ్ వేములపల్లి వెంకటరామయ్య అధ్యక్షత వహిస్తారు. అఖిల భారత రైతుకుల సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి ఆశిష్ మిట్టల్,జాతీయ నాయకులు జితేందర్ సింగ్ (పంజాబ్ ),సుశాంత్ ఝా (పశ్చిమబెంగాల్), ధరం పాల్ (ఉత్తరప్రదేశ్), కే,సెల్వరాజ్ (తమిళనాడు) నశంభు ప్రసాద్ సింగ్( బీహార్) కేదార్ సబర్ (ఒడిస్సా) దేబాజిత్ (అస్సాం )రాబిన్ (కేరళ ) కామ్రేడ్ చిట్టి పాటి వెంకటేశ్వర్లు (ఆంధ్ర ప్రదేశ్) కామ్రేడ్ బిక్షపతి (తెలంగాణ) తదితరులు పాల్గొంటారని కావున రైతులు కూలీలు ఈ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *