తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:-
ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు,ప్రజల సొమ్ము, బ్యాంకింగ్ లావాదేవీలకు భద్రత కల్పించడమే లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు ఏటీఎం కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఏటీఎం కేంద్రాల్లో ఏర్పాటు చేసిన CCTV కెమెరాలు, అలారం వ్యవస్థలు, భద్రతా సిబ్బంది, లైటింగ్, ప్రవేశ–నిష్క్రమణ మార్గాలు తదితర భద్రతా అంశాలను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు కనిపించినప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఏటీఎం నిర్వాహకులు, బ్యాంకు సిబ్బందికి సూచించారు.అదేవిధంగా ఏటీఎం కేంద్రాల పరిసరాల్లో రాత్రి వేళల్లో పోలీసుల గస్తీ, నిఘా మరింత పెంచాలని సంబంధిత సిబ్బందికి సూచనలు చేశారు. ప్రజలు ఏటీఎంల వద్ద అప్రమత్తంగా ఉండాలని, తమ ATM PIN, OTP, CVV వంటి బ్యాంకింగ్ వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోవద్దని పోలీసులు అవగాహన కల్పించారు.ప్రజల ఆస్తి, ధనానికి భద్రత కల్పించడంలో భాగంగా ప్రకాశం జిల్లా పోలీసులు నిరంతరం నిఘా కొనసాగిస్తూ, సురక్షితమైన వాతావరణం కల్పించేందుకు చర్యలు చేపడుతున్నారు.