ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న ‘సేవా సంకల్ప్ అభియాన్’లో భాగంగా శుక్రవారం ఇందుకూరుపేటలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో పాల్గొన్నాను.25 ఏళ్ల సుదీర్ఘ ప్రజాసేవను అందిస్తున్న మోదీ గారికి ఈ సందర్భంగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. శ్రీవారి ఆశీస్సులతో మోదీ గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ప్రార్థిస్తున్నాను.రక్తదానం చేసి ఆపదలో ఉన్నవారికి అండగా నిలిచిన యువతకు అభినందనలు. సేవా కార్యక్రమాల్లో యువత మరింతగా భాగస్వాములు కావాలి.కేంద్రంలో మోదీ గారు.. రాష్ట్రంలో చంద్రబాబు గారు.. డబుల్ ఇంజిన్ సర్కారుతో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సమన్వయంతో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయం.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *