తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాలు, మండలాలకు రావాల్సిన నిధులను అందిస్తూ.. రహదారులు, సీసీ రోడ్లు, పొలాలకు వెళ్లే మార్గాలు, కనెక్టివిటీ రోడ్ల వంటి అనేక అభివృద్ధి పనులను చేపట్టాం.పల్లె పండుగ 1.0, 2.0తో పాటు ఇప్పుడు పల్లె పండుగ 3.0 ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి మరింత వేగం పుంజుకుంటోంది. కందుకూరు నియోజకవర్గానికి సుమారు ₹100 కోట్ల మేర అభివృద్ధి నిధులు రావడం ఇందుకు నిదర్శనం.ఈ నెల 29న ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం రామాపురం గ్రామంలో జరిగే పల్లె పండుగ 3.0 ప్రారంభ కార్యక్రమానికి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, మంత్రి శ్రీ నారా లోకేష్ గారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మాధవ్ గారు హాజరుకానున్నారు.ఈ కార్యక్రమానికి సంబంధించి సభా ప్రాంగణం ఏర్పాట్లను ఉదయగిరి ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారు, శ్రీ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారితో కలిసి పరిశీలించాను. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సభా ప్రాంగణం, పార్కింగ్, ఇతర సౌకర్యాల ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని అధికారులకు సూచించాం.కందుకూరు, కనిగిరి, ఉదయగిరి, కావలి, ఆత్మకూరు తదితర నియోజకవర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని పల్లె పండుగ 3.0 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాను.