తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
కందుకూరు బాలికల ఉన్నత పాఠశాలలో గుఱ్ఱం జాషువా గారి 131వ జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని, మహాకవి జాషువా గారి సామాజిక దృక్పథం, సమానత్వ భావన, అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషిని స్మరించుకున్నాను.జాషువా గారు తన సాహిత్యం, ఆలోచనల ద్వారా సమాజంలో సమానత్వం, మానవత్వం, సామాజిక చైతన్యానికి బలమైన పునాది వేశారు. ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ వివక్షలకు అతీతంగా సమానత్వ భావనతో ముందుకు సాగాలి.అలాంటి మహనీయుల జయంతులను ప్రతి సంవత్సరం స్మరించుకోవడం ద్వారా వారి ఆశయాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది.