తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:-
ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఉలవపాడు మండలం కృష్ణాపురం గ్రామంలో పోలీసులు కోడిపందేలపై ప్రత్యేక దాడి నిర్వహించారు.ఈ దాడిలో అక్రమంగా కోడిపందేలు నిర్వహిస్తున్న 6 మందిని పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.4,000/- నగదు స్వాధీనం చేసుకున్నారు.అక్రమ జూదం, కోడిపందేలు వంటి కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ప్రజలు ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు.ప్రజా శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా అక్రమ కార్యకలాపాలపై ప్రకాశం జిల్లా పోలీసులు నిరంతరం నిఘా కొనసాగిస్తున్నారు.