నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో నిర్వహించిన పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పాల్గొన్నారు.ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా రూ.11,085 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు నిర్వహించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.ఈ కార్యక్రమాన్ని దర్శి టిడిపి ఇంచార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మీ గారు, టిడిపి యువ నాయకులు డా. కడియాల లలిత్ సాగర్ గారు ఆధ్వర్యంలో దర్శి టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన లైవ్ స్క్రీనింగ్ ద్వారా స్థానిక నాయకులు, కూటమి శ్రేణులతో కలిసి వీక్షించారు.ఈ సందర్భంగా డా. గొట్టిపాటి లక్ష్మీ గారు మాట్లాడుతూ,
పల్లె పండుగ 3.0 ద్వారా దర్శి నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో 60 అభివృద్ధి పనులకు సంబంధించి మొత్తం రూ.25 కోట్ల నిధులు మంజూరయ్యాయని తెలిపారు.
గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులను బలోపేతం చేస్తూ, ప్రజలకు మెరుగైన సదుపాయాలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో దర్శి సొసైటీ అధ్యక్షులు కలువకొలను చంద్రశేఖర్, ఏఎంసీ చైర్మన్ దారం నాగవేణి–సుబ్బారావు, దర్శి మండల టిడిపి అధ్యక్షులు మారెళ్ల వెంకటేశ్వర్లు, నియోజకవర్గంలోని వివిధ హోదాల్లో ఉన్న టిడిపి సీనియర్ నాయకులు, కూటమి శ్రేణులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *