సీనియర్ సివిల్ జడ్జి మరియు మండల లీగల్ సెల్ కమిటీ చైర్మన్ శ్రీ కె కె వి బుల్లి కృష్ణ.
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
స్థానిక కోర్టు ప్రాంగణము నుండి గురువారం అనగా 8.10.2026 న గౌరవనీయ సుప్రీంకోర్టు వారి ఆదేశానుసారం మరియు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి సూచనల మేరకు కందుకూరు మండల కమిటీ ఆధ్వర్యంలో ప్రజల్లో సామాజిక అంశాల పట్ల అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. వరకట్న వేధింపులు, లింగ సమానత్వం, రాజ్యాంగ విలువలు, మహిళల హక్కులు పట్ల మరియు మధ్యవర్తిత్వం ద్వారా కేసుల పరిష్కారం పై అవగాహన కల్పించడానికి ఈర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి మరియు చైర్మన్ మండల లీగల్ సర్వీసెస్ కమిటీ కే. కే.వి.బులికృష్ణ, జూనియర్ సివిల్ జడ్జి శ్రీమతి డి కళ్యాణి, జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కుమారి లంకా అన్నపూర్ణ శ్రీ, బార్ అసోసియేషన్ అధ్యక్షులు వి.శ్రీధర్ నాయుడు తో పాటుగా మహిళా శిశు అభివృద్ధి శాఖ ప్రతినిధులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.