ట్రాఫిక్ నిబంధనలు పాటించని డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఆటోలు నడిపిన వారికి వాహన చోదకులకు సింగరాయకొండ పోలీస్ లు ఇరవై వేల రూపాయలు జరిమానా విధించారు. జాతీయ రహదారి 16 పై వాహనాలు నడిపే వాహన దారులు తప్పని సరిగా నిబంధనలు పాటించాలని తగిన పత్రాలు, భీమా చెల్లింపు రసీదులు దగ్గర ఉంచుకోవాలని సింగరాయకొండ పోలీస్ లు పిలుపు ఇచ్చారు. నిబంధనలు అతిక్రమించిన వాహన దారులు చోదకులకు నిబంధనల ప్రకారం అధిక జరిమానా విధించడం జరుగుతుందని పోలీస్ లు హెచ్చరించారు. ప్రాణం విలువ తెలుసుకుని వాహనాలు నడపాలని పోలీస్ కోరారు. అతివేగం, నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం ప్రమాదకరం గా భావించి ద్విచక్ర వాహన దారులు రోడ్డు పై వాహనాలు నడిపే సమయం లో తప్పని సరిగా హెల్మెట్ ధరించాలని పోలీస్ లు కోరారు. నిర్లక్ష్యంగా సరయిన పత్రాలు లేని ఆటో నడుపుతున్న రెండు అటో లకు ఇరవై వేల రూపాయలు అపరాధ రుసుం విధించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *