తొలి శుభోదయం న్యూస్ కోవూరు నియోజకవర్గం:-
నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం, వరికుంటపాడు మండలం రామాపురం గ్రామంలో మంగళవారం నిర్వహించిన ‘పల్లె పండుగ 3.0’ ప్రారంభోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కల్యాణ్ గారు ముఖ్య అతిథులుగా హాజరైన ఈ కార్యక్రమానికి ఎంపీ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో కలిసి పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికాను. పల్లె పండుగ ద్వారా రూ.12 వేల కోట్లతో గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, సమగ్రాభివృద్ధికి శ్రీకారం చుట్టడం అభినందనీయం. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గారిని కలిసి కోవూరు నియోజకవర్గంలోని గ్రామీణ రహదారుల పునర్నిర్మాణానికి రూ.56.20 కోట్లు మంజూరు చేయాలని కోరుతూ వినతిపత్రాన్ని అందజేశాను.