తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:-
ఒంగోలులోని ఆనంద్ మినీ స్టేడియంలో జరుగుతున్న వేడుకలకు గౌరవ మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు, ఒడిస్సా గవర్నర్ శ్రీ కంభంపాటి హరిబాబు గారు, శాసనమండలి మాజీ చైర్మన్ ఎండి.అహ్మద్ షరీఫ్ గారు, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు, రాజ్యసభ సభ్యులు భాష్యం రామకృష్ణ గారు, స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు గారు, తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు గారు అతిధిగా పాల్గొని …. శ్రీ వెంకయ్య నాయుడు గారి చేతుల మీదుగా జ్ఞాపిక అందుకున్నారు.అంతకుముందు ఒంగోలు చారిత్రక వైభవం, సంస్కృతి, అభివృద్ధికి సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్ ను నేతలు తిలకించారు.