పాకల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆడిటోరియంలో బుధవారం ఉమ్మడి ప్రకాశం జిల్లాస్థాయి రెజ్లింగ్ టోర్నమెంట్ కం సెలక్షన్స్ అత్యంత ఉత్సాహంగా నిర్వహించబడ్డాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు ఈ పోటీలలో పాల్గొని తమ ప్రతిభను, నైపుణ్యాన్ని ప్రదర్శించారు. 14, 17 మరియు 19 సంవత్సరాల వయసులోపు బాలురు, బాలికలకు నిర్వహించిన ఈ సెలక్షన్స్ లో గెలుపొందిన వారు వచ్చే నెల 10, 11, 12 తేదీల్లో పల్నాడు జిల్లా కారంపూడిలో జరిగే రాష్ట్రస్థాయి టోర్నమెంట్‌లో పాల్గొంటారని స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సెక్రటరీలు M. రాజ్యలక్ష్మి మరియు P. శివ శంకర్ తెలిపారు. ఈ కార్యక్రమానికి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సెక్రటరీ M. రాజ్యలక్ష్మి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్. ప్రసాదు హాజరుకాగా, ఎస్.ఏ.ఏ.పి. (SAAP) నుండి K. మనోహర్ అబ్జర్వర్‌గా వ్యవహరించారు; టెక్నికల్ అఫీషియల్స్‌గా కె. ఇమ్మానుయేల్, N. సత్యనారాయణ నాయక్ హాజరయ్యారు. వివిధ పాఠశాలల పీడీలు, ఉపాధ్యాయులు, క్రీడాకారులు పాల్గొన్న ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన పాఠశాల ఫిజికల్ డైరెక్టర్లు వడ్లమూడి కోటేశ్వరరావు, తేళ్ళ వంశీకృష్ణలను గ్రామస్తులు మరియు ఉపాధ్యాయులు అభినందించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *