విజయవాడ బార్ అసోసియేషన్ కు చెందిన న్యాయవాదులైన లెనిన్ మరియు వి. కిరణ్ కుమార్ పై విజయవాడ పోలీసుల అనుచిత ప్రవర్తనను నిరసిస్తూ సింగరాయకొండ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం సింగరాయకొండ కోర్టు ప్రాంగణంలో న్యాయవాదులు నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు సన్నెబోయిన శ్రీనివాసులు మాట్లాడుతూ, న్యాయవాదులు తమ వృత్తి నిర్వహణలో ఎదుర్కొంటున్న సమస్యలు, వారి భద్రతకు సంబంధించిన అంశాలను ప్రస్తావించారు. న్యాయవాదుల రక్షణ కోసం అడ్వకేట్ ప్రొటెక్షన్ చట్టం అవసరాన్ని వివరించారు. న్యాయవాదులపై దాడులు, బెదిరింపులు, విధి నిర్వహణకు ఆటంకం కలిగించే ఘటనలను అరికట్టేందుకు తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా విజయవాడ సంఘటనలో న్యాయవాదులపై నమోదు చేసిన తప్పుడు కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మహిళా న్యాయవాదుల పట్ల మహిళా పోలీసుల సమక్షం లేకుండా పోలీసులు వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.మహిళా న్యాయవాదుల హక్కులు, గౌరవం, భద్రతను కాపాడేందుకు సింగరాయకొండ బార్ అసోసియేషన్ ఎల్లప్పుడూ న్యాయవాదులకు అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలిపారు.ఈ నిరసన కార్యక్రమంలో సింగరాయకొండ బార్ అసోసియేషన్ కార్యదర్శి బక్కమంతల వెంకటేశ్వర్లు,న్యాయవాదులు రాఘవేంద్ర, సురేష్,శ్రీనివాసులు,పంతగాని వెంకటేశ్వర్లు,నాగరాజు, కోదండపాణి, హర్ష,మహిళా న్యాయవాదులు శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *