ప్రకాశం జిల్లా కందుకూరు డివిజన్‌లోని బొగ్గుల సంఘంలో జీవన జ్యోతి దివ్యాంగ వికాస సేవా సమితి ఆధ్వర్యంలో వృద్ధులకు రగ్గుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా జీవన జ్యోతి సేవా సమితి కార్యదర్శి శీలం వెంకటేష్ మాట్లాడుతూ, “వృద్ధులు మన కుటుంబాలకు, సమాజానికి ఎంతో విలువైన వారు. వారి అవసరాలను దృష్టిలో ఉంచుకుని, చల్లని వాతావరణంలో ఉపయోగపడేలా అద్దంకికి చెందిన నన్నం సృజన, రవికుమార్ గారి సహకారంతో రగ్గులు అందించాము” అని అన్నారు.“వృద్ధులను గౌరవించడం అంటే మన గతాన్ని గౌరవించడమే. వారి పట్ల చూపే ఆప్యాయత, మనస్ఫూర్తిగా చేసే చిన్న సహాయం వారికి ఎంతో విలువైనది” అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ప్రేమ్ బాబు, తాహిర్, ఇమ్రాన్ నజీర్, చందన్, వేణు బాబు తదితరులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *