ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు జిల్లాలో నిర్వహిస్తున్న స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ (SMC) ఎన్నికల సందర్భంగా ప్రకాశం జిల్లా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తూ పాఠశాలల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.SMC ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా నిర్వహించేందుకు పోలీసు అధికారులు పలు ఎన్నికల కేంద్రాలను సందర్శించి అక్కడి బందోబస్తు ఏర్పాట్లు, పోలీసు సిబ్బంది విధులు మరియు భద్రతా పరిస్థితులను పరిశీలించారు. పాఠశాల పరిసర ప్రాంతాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నారు.ఎన్నికల సమయంలో పాఠశాలలకు వచ్చే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు ఇతర సంబంధిత వ్యక్తులు శాంతియుత వాతావరణాన్ని పాటిస్తూ, ఎన్నికల నిబంధనలకు సహకరించాలని పోలీసులు సూచించారు.ప్రజల సహకారంతో SMC ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని భద్రతా చర్యలను ప్రకాశం జిల్లా పోలీసులు చేపడుతున్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *