తొలి శుభోదయం న్యూస్ జరుగుమల్లి:-
జరుగుమల్లి బీసీ వెల్ఫేర్ హాస్టల్‌లో జరిగిన ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి, హాస్టల్ సిబ్బంది మరియు ఘటనకు సంబంధించిన ప్రతి ఒక్కరి పాత్రను పరిశీలించి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎం.ఆర్.పి.ఎస్ ప్రకాశం జిల్లా అధ్యక్షులు రావినూతల కోటి మాదిగ డిమాండ్ ఈ అంశంపై ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీ పి.రాజాబాబు ఐఏఎస్ గారిని మరియు సంతనూతలపాడు ఎమ్మెల్యే బి ఎన్ విజయ్ కుమార్ గారిని మద్దిపాడు స్పెషల్ పీజీఆర్ఎస కార్యక్రమంలో కలిసి వినతిపత్రం అందజేసి, ఘటనకు సంబంధించిన అన్ని కోణాల్లో సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు. అలాగే కేసు త్వరితగతిన విచారణకు వచ్చేలా చర్యలు తీసుకుని, నిందితులకు చట్ట ప్రకారం శిక్ష పడేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.ఇప్పటికే అతనిపై కేసు నమోదు చేశామని, హాస్టల్ కుక్ ను సస్పెండ్ చేశామని జిల్లా కలెక్టర్ తెలియజేశారు. ఎమ్మెల్యే బి ఎన్ విజయ్ కుమార్ గారు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు అని ఎం ఆర్ పి ఎస్ నాయకులు తెలిపారు. అయితే ఘటనలో హాస్టల్ సిబ్బంది పాత్రతో పాటు, ఎవరి పాత్ర ఉన్నా వారిని విచారించి బాధ్యతను నిర్ధారించాలని కోరారు.అదేవిధంగా జిల్లా స్థాయి కమిటీ ఏర్పాటు చేసి బీసీ వెల్ఫేర్ హాస్టల్ సిబ్బందిపై సమగ్ర విచారణ చేపట్టాలని, ఘటనకు సంబంధించిన ప్రతి అంశాన్ని పరిశీలించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఎం ఆర్ బి ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.అనంతరం ఘటనపై హాస్టల్ సిబ్బంది మరియు నిందితుడి పాత్రపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరుతూ ఒంగోలు డీస్పీ రాయపాటి శ్రీనివాసరావు గారిని కలిసి ఎం ఆర్ పి ఎస్ ప్రకాశం జిల్లా అధ్యక్షులు రావినూతల కోటి మాదిగ వినతిపత్రం అందజేశారు. ఘటనకు సంబంధించిన అన్ని కోణాలను పరిశీలించి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ కొండపి నియోజకవర్గ ఇన్‌చార్జి రేణమాల మాధవ మాదిగ, ఆహారోన్, సుధాకర్, పౌలు, ఇమ్మానేయులు తదితరులు పాల్గొన్నారు.
