ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ నిబంధనల అమలు మరియు ప్రజల భద్రత కోసం ప్రకాశం జిల్లా పోలీసులు విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించారు.ఈ తనిఖీలలో భాగంగా ప్రధాన రహదారులు, ముఖ్య కూడళ్లు మరియు రద్దీ ప్రాంతాల్లో వాహనాలను తనిఖీ చేసి, వాహనాల పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్, హెల్మెట్ వినియోగం, సీట్ బెల్ట్ తదితర అంశాలను పరిశీలించారు.ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం వల్ల జరిగే ప్రమాదాలపై వాహనదారులకు అవగాహన కల్పిస్తూ, హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, సీట్ బెల్ట్ వినియోగించాలని, మద్యం సేవించి వాహనం నడపవద్దని పోలీసులు సూచించారు.అధిక వేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్ వంటి నిబంధనల ఉల్లంఘనలకు దూరంగా ఉండాలని, తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా కాపాడాలని వాహనదారులకు సూచించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *