కందుకూరు మున్సిపాలిటీకి ఎన్నికలు నిర్వహించేందుకు మార్గం సుగమం కావడం ప్రజాస్వామ్యానికి, కందుకూరు ప్రజల ఆకాంక్షలకు లభించిన విజయంగా భావిస్తున్నాను.గత కొంతకాలంగా ఎన్నికలకు అడ్డంకులు సృష్టించినప్పటికీ, చివరకు న్యాయమే గెలిచింది. ఇక కందుకూరు మున్సిపాలిటీ మరింత అభివృద్ధి దిశగా ముందుకు సాగనుంది.గత రెండున్నరేళ్లలో మున్సిపాలిటీ పరిధిలో రూ.179 కోట్లతో అభివృద్ధి పనులు, 274 రోడ్ల నిర్మాణం చేపట్టాం. ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని రోడ్ల వెడల్పు, భూ సమస్యలకు పరిష్కారం చూపించాం. HAM పథకం ద్వారా మరో రూ.39 కోట్ల నిధులు రానున్నాయి.అభివృద్ధిపై విమర్శలు చేస్తున్న వారు ఎవరైనా సరే… రండి. మీడియా సమక్షంలోనే కందుకూరులో మేము చేసిన అభివృద్ధిని చూపిస్తాం. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిపైనా చర్చిద్దాం.రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అభివృద్ధి, సంక్షేమమే మా రెఫరండం. ప్రజలకు సేవ చేయడమే మా లక్ష్యం.స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. బీసీలకు రాజకీయ అవకాశాలు కల్పించడంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ముందుంటుంది.కందుకూరు అభివృద్ధిని మరింత వేగవంతం చేసేందుకు ప్రజల ఆశీస్సులు, సహకారం కోరుతున్నాను.అభివృద్ధికి అడ్డుపడే రాజకీయాలకు స్వస్తి పలికి… అభివృద్ధి కోసం పనిచేసే కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *