భారత స్వాతంత్య్రోద్యమంలో మహనీయుడు, అహింసావాది, జాతిపిత మహాత్మా గాంధీ 157 వ జయంతి సందర్భంగా శుక్రవారం జిల్లా పోలీసు క్యాంపు కార్యాలయంలో జిల్లా ఎస్పీ గారు మరియు పోలీస్ అధికారులు ఆ మహనీయుని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ, అహింసనే ఆయుధంగా చేసుకుని బ్రిటిష్ వారిని ఎదిరించి, శాంతియుతంగా పోరాడి భారతదేశానికి స్వాతంత్య్రాన్ని అందించి, ప్రపంచ చరిత్రలో గొప్ప వ్యక్తిగా, జాతిపితగా నిలిచారని అన్నారు. ఉప్పు సత్యాగ్రహం, సహాయ నిరాకరణ వంటి ఉద్యమాల్లో యావత్ దేశ ప్రజల్లో స్వరాజ్య స్ఫూర్తిని రగిలించారని, స్వాతంత్ర్య పోరాటంలో ఆయన చూపిన మార్గం, సేవలు, ఆశయాలను మనమందరం స్మరించుకోవాలన్నారు. బాపూజీ జీవితం, ఆయన ఆదర్శాలు సత్యం, అహింస, ధర్మ మార్గాలు ప్రతి తరానికి స్ఫూర్తినిస్తూనే ఉంటాయని, మహాత్ముని బోధనలు, ఆదర్శాలు, జీవిత విలువలను అనుసరిస్తూ శాంతి, సమానత్వం, మతసామరస్యాన్ని పాటిస్తూ ముందుకు సాగాలని, ఆయన కలలు కన్న దేశాన్ని రూపొందించడానికి మనమంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *