తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
సింగరాయకొండలోని ప్రైవేటు పాఠశాలలో విద్యార్థి తౌషిక్ మరియు అతని తల్లి మౌలాభి మృతులకు కారణమైన వ్యక్తులను శిక్షించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. మౌలాభి కుటుంబానికి న్యాయం చేయాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ కందుకూరు పట్టణంలోని ఫంక్షన్ హాల్లో ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.ముస్లిం పెద్దలు, దళిత సంఘాలు, విద్యార్థి సంఘాల నాయకులు, పలు పార్టీల నేతలు కార్యక్రమంలో పాల్గొన్నారు.