కొండపి పోలీస్ స్టేషన్ పరిధిలోని డా. బి.ఆర్. అంబేద్కర్ గురుకులాన్ని కొండపి సీఐ గారు మరియు ఎస్‌ఐ గారు సందర్శించి విద్యార్థులతో మమేకమై వారి సమస్యలు, భద్రతకు సంబంధించిన అంశాలపై చర్చించారు.ఈ సందర్భంగా విద్యార్థినులకు మహిళల భద్రత, బాలికల రక్షణ, గుడ్ టచ్–బ్యాడ్ టచ్, POCSO చట్టం, వేధింపుల నివారణ మరియు అత్యవసర పరిస్థితుల్లో పోలీసులను సంప్రదించే విధానం తదితర అంశాలపై అవగాహన కల్పించారు.ఎలాంటి సమస్య ఎదురైనా భయపడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా పోలీసులకు వెంటనే సమాచారం అందించాలని సూచించారు. మహిళలు, బాలికల భద్రత కోసం పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *