తొలి శుభోదయం న్యూస్ దర్శి నియోజకవర్గం :-
దొనకొండ మండలంలోని మంగినపూడి నుంచి అనంతవరం వరకు బీటీ రహదారి నిర్మాణానికి పల్లె పండుగ–3.0 ద్వారా రూ.3.70 కోట్లు మంజూరయ్యాయి.దర్శి టీడీపీ ఇంచార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మీ గారు భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు.రహదారి నిర్మాణంతో మంగినపూడి, అనంతవరం, పరిసర గ్రామాల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందనున్నాయి. రైతులు తమ పంటలను మార్కెట్లకు తరలించేందుకు మరింత సౌలభ్యం కలగనుంది.గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యం.
అభివృద్ధి పనులు వేగంగా… నాణ్యతతో పూర్తి చేయడమే మా సంకల్పం.