రాష్ట్రం, దర్శి నియోజకవర్గం సస్యశ్యామలంగా వర్ధిల్లాలని, రైతన్నలకు సమృద్ధిగా పంటలు పండాలని, ప్రజలకు సాగు, తాగునీటి కొరత లేకుండా ఉండాలని ఆకాంక్షిస్తూ తాళ్లూరు మండలం సోమవరపురపాడు గ్రామంలోని శ్రీ గుంటి గంగ భవాని అమ్మవారి దేవస్థానంలో వరుణ యాగం నిర్వహించారు.దర్శి టీడీపీ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ ఆధ్వర్యంలో వేదపండితులు శాస్త్రోక్తంగా యాగాన్ని నిర్వహించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మీ మాట్లాడుతూ.. ప్రకృతి కరుణించి సమృద్ధిగా వర్షాలు కురిసి, దర్శి నియోజకవర్గ రైతులు, ప్రజలు సుఖసంతోషాలతో సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించామని తెలిపారు.ఈ కార్యక్రమంలో టీడీపీ, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *