తొలి శుభోదయం న్యూస్ కందుకూరు నియోజకవర్గం :-
గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ క్లినిక్‌ను ఏర్పాటు చేశాం. ఈ సందర్భంగా గ్రామ ప్రజలతో సమావేశమై పలు అభివృద్ధి అంశాలపై చర్చించాను.కూటమి ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలను అందిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం మరియు అధికారుల సహకారంతో నియోజకవర్గంలో పెద్దఎత్తున అభివృద్ధి పనులు చేపడుతోంది.అమ్మవారిపాలెం చెరువు అభివృద్ధికి ఇప్పటికే రూ.20 లక్షలు కేటాయించి పనులు చేపట్టాం. గ్రామ సమీపంలోని ఎలికేరు వద్ద ఏడాదిలోగా బ్రిడ్జిల నిర్మాణం చేపట్టేందుకు చర్యలు తీసుకుంటాం. ఎస్సీ కాలనీ వాసులకు త్వరలో ఇళ్ల పట్టాలు అందించడంతో పాటు, గ్రామంలో మూడు బోర్లు ఏర్పాటు చేస్తాం.అలాగే రీ-సర్వే ద్వారా రైతులు గతంలో ఎదుర్కొన్న సమస్యలను పరిష్కరించి, వారికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటాం.ఇండోసోల్, బీపీసీఎల్ వంటి పరిశ్రమల ద్వారా స్థానికంగా చదువుకున్న యువతీ యువకులకు పెద్దఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించడమే నా లక్ష్యం. కందుకూరు నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తాను.