తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:-
ఒంగోలు విజిలెన్స్ & ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ ఆదేశాల మేరకు ఒంగోలు vigilance and enforcement అధికారులు ఫుడ్ సేఫ్టీ మరియు లీగల్ మెట్రాలజీ అధికారులతో కలిసి ఒంగోలు నగరం లో నాగేంద్రనగర్ 2వ లైన్, నందు శివ గాయత్రి మిల్క్ డెయిరీ అండ్ నెయ్యి ప్రిపరేషన్ సెంటర్ పై ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.
తనిఖీలో సుమారు 170 కిలోల కల్తీ నెయ్యి గుర్తించగా, 95 కిలోల వెన్న, 75 కిలోల రుచి గోల్డ్ పామాయిల్, 4 కిలోల వనస్పతి మరియు హానికర రసాయనాలు ఉపయోగించి నెయ్యి తయారు చేస్తున్నట్లు గుర్తించారు.ఈ నెయ్యిని హోటళ్లు, మెస్‌లు, బిర్యానీ హోటళ్లు మరియు హోల్‌సేల్ దుకాణాలకు సరఫరా చేస్తున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.
నెలకు సుమారు 3,000 కిలోల నెయ్యిని రూ.12.80 లక్షల విలువతో విక్రయిస్తూ, అధిక లాభాలు ఆర్జిస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. కల్తీ నెయ్యి తయారు చేయడానికి ఉపయోగించిన సుమారు రూ.20 లక్షల సరుకును సీజ్ చేయడమైంది. ఫుడ్ సేఫ్టీ అధికారులు నమూనాలను సేకరించి ప్రయోగశాల (ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ), చెన్నైకు పరీక్షల కోసం పంపించారు. కల్తీ నెయ్యి తయారు చేసి విక్రయిస్తున్న వారిపై Essential Commodities Act, 1955, Section 6-A మరియు ఇతర చట్టాలను అనుసరించి కేసు నమోదు చేయడమైనది. లీగల్ మెట్రాలజీ అధికారులు కుడా 05 కేసులు నమోదు చేశారు.ఇటువంటి కల్తీ నెయ్యిని ఏ సంస్థలైన అమ్మిన వారిపైన కూడా చర్యలు తీసుకొనబడును. ఏ విధమైన ఆహార పదార్ధాల, కల్తీకి పాల్పడిన యెడల కఠిన చర్యలు తీసుకొనబడును. తనిఖీలో విజిలెన్స్ & ఎన్ఫోర్స్మెంట్ అధికారులతో పాటు ఫుడ్ సేఫ్టీ, లీగల్ మెట్రాలజీ మరియు సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.