సమస్యలను ప్రారంభ దశలోనే పరిష్కరించేందుకు పల్లె నిద్ర ఓ శక్తివంతమైన వేదిక
సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకం
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:-
ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్థన్ రాజు ఐపియస్.,గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీస్ అధికారులు మరియు సిబ్బంది కలసి ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలోని గ్రామాల్లో రాత్రి పల్లెనిద్ర కార్యక్రమాలను నిర్వహించారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా, అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ప్రజలకు అవగాహన కల్పించారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో గ్రామ ప్రజల సమస్యలను తెలుసుకుని, వివిధ నేరాలపై అప్రమత్తంగా ఉండేలా అవగాహన కల్పించారు.పల్లెనిద్రలో భాగంగా పోలీసు అధికారులు ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటిని ప్రారంభ దశలోనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. పోలీసు సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడంతో పాటు, గ్రామీణ ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా విధులు నిర్వహిస్తున్నారు.రానున్న స్థానిక ఎన్నికల నేపథ్యంలో ప్రజలు శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడకుండా, అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, వదంతులు మరియు తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయవద్దని సూచించారు.ప్రస్తుత సమాజంలో పెరుగుతున్న సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. డిజిటల్ అరెస్టులు, లోన్ యాప్, ఏపీకే ఫైల్ ఫ్రాడ్స్పై అప్రమత్తంగా ఉండాలని, అపరిచిత కాల్స్, లింకులను నమ్మవద్దని, బ్యాంకు ఖాతా వివరాలను ఇతరులతో పంచుకోవద్దని సూచించారు.రోడ్డు ప్రమాదాల నియంత్రణలో భాగంగా హెల్మెట్ ఆవశ్యకతపై ప్రజలకు అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, హెల్మెట్ ధరించడం ద్వారా ప్రమాదాల్లో ప్రాణాపాయం నుంచి బయటపడే అవకాశం ఉంటుందని సూచించారు.మహిళలు, చిన్నారులపై జరిగే నేరాలు, సంబంధిత చట్టాలు, గంజాయి, మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. నేరాల నివారణ, నిందితుల గుర్తింపులో సి.సి.టి.వి. కెమెరాల ప్రాధాన్యతను వివరించి, ప్రతి ఒక్కరూ సి.సి.టి.వి. కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించడం చట్ట విరుద్ధం. మద్యం మత్తులో వారు ఏదైనా నేరాలకు పాల్పడే అవకాశం ఉంటుంది కనుక శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకొని నేరాలను కట్టడి చేసే ఉద్దేశంతో బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు.అసాంఘిక, చట్టవ్యతిరేక కార్యకలాపాల గురించి సమాచారం తెలిస్తే స్థానిక పోలీస్ అధికారులకు (లేదా) డయల్ 112 నంబర్లకు కాల్ చేసి అందించాలని… సమాచారం పంపిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.