ప్రకాశం జిల్లా పొన్నలూరు మండల కేంద్రంలో ఇప్పగుంట గ్రామం పోవుదారిలో కొంతమంది రజిక మరియు దొమ్మర కులానికి చెందినవారు గత 20 సంవత్సరాల నుండి గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నాము అని,06-10-2026 అర్ధరాత్రి 12:30 గంటల సమయంలో అగ్రకులానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ట్రాక్టర్ తో వచ్చి కొత్తగా నిర్మించుకుంటున్న గుడిసెలను పడగొట్టి కొట్టి బెదిరించి దౌర్జన్యం చేశారు అని బాధితులు తెలియజేశారు. బుధవారం ఉదయం బాధితులు జనసేన పార్టీ కొండపి నియోజకవర్గ మాజీ సమన్వయకర్త శ్రీ కనపర్తి మనోజ్ కుమార్ గారి దృష్టికి ఈ సమస్యను తీసుకునివచ్చారు, వెంటనే మనోజ్ కుమార్ స్పందించి బాధితుల స్థలాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు, ఆ తరువాత బాధితులను పొన్నలూరు పోలీస్ స్టేషన్ కి తీసుకొని వచ్చి ఫిర్యాదు చేయించారు, అతి తొందరలో ఈ సమస్యను మంత్రివర్యులు డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి గారి దృష్టికి మరియు తగిన అధికారుల దృష్టికి ఈ సమస్యను తీసుకొని వెళ్లి అధికారుల ద్వారా ఈ సమస్యకు పరిష్కార మార్గాలు చూపించడం జరుగుతుంది, అదేవిధంగా కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కరికి అండగా ఉంటుంది అని జనసేన పార్టీ కొండపి నియోజకవర్గ మాజీ సమన్వయకర్త శ్రీ కనపర్తి మనోజ్ కుమార్ తెలియజేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *