ఈ నెల 12న ఎమ్మార్పీఎస్, ముస్లిం సంఘాలు, ప్రజాసంఘాలు తలపెట్టిన చలో కలెక్టరేట్ కార్యక్రమానికి అనుమతులు రద్దు చేసినట్లు ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు తెలిపారు. డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సింగరాయకొండ చైతన్య పాఠశాల విద్యార్థి, అతని తల్లి మృతి కేసులో ప్రత్యేక దర్యాప్తు కొనసాగుతోందని, కేసుకు సంబంధించిన అంశాలు హైకోర్టు పరిధిలో ఉన్నాయని వెల్లడించారు. జిల్లాలో 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉన్నందున ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సభలు, సమావేశాలకు అనుమతులు రద్దు చేసినట్లు చెప్పారు. అనుమతులు లేని ధర్నాకు ప్రజలు హాజరుకావద్దని, ప్రజా హక్కులకు భంగం కలిగించవద్దని కోరారు. సమావేశంలో డీఎస్పీ శ్రీనివాసరావు, ఎస్బీ సీఐ శ్రీనివాసరావు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *