తొలి శుభోదయం న్యూస్ దర్శి నియోజకవర్గం:-
పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో భాగంగా ₹1.90 కోట్ల నిధులతో చేపట్టనున్న తాళ్లూరు–మల్కాపురం, లింగాలపాడు–మన్నెపల్లి రహదారుల నిర్మాణ పనులకు ఆదివారం సాయంత్రం దర్శి టీడీపీ ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు.గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించి, ప్రజల ప్రయాణ ఇబ్బందులను తొలగించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆమె తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, టీడీపీ, జనసేన నాయకులు, కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.